-->

షబాష్‌పల్లి కంపెనీలో గంజాయి కలకలం.. ఐదుగురు అరెస్ట్ కోర్టులో హాజరుపరిచిన తూప్రాన్ పోలీసులు

షబాష్‌పల్లి కంపెనీలో గంజాయి కలకలం.. ఐదుగురు అరెస్ట్ కోర్టులో హాజరుపరిచిన తూప్రాన్ పోలీసులు


షబాష్‌పల్లి కంపెనీలో గంజాయి కలకలం.. ఐదుగురు అరెస్ట్ కోర్టులో హాజరుపరిచిన తూప్రాన్ పోలీసులు

తూప్రాన్, సెప్టెంబర్ 3: మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలో గంజాయి కలకలం రేపింది. షబాష్‌పల్లి ప్రాంతంలోని ఓ కంపెనీలో పని చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఐదుగురు వ్యక్తులు గంజాయి కేసులో పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అలావుద్దీన్, లవకుష్, హన్స్రాజ్, దినేష్, యస్తామికుమార్ షబాష్‌పల్లి ప్రాంతంలోని ఓ కంపెనీలో పనిచేసేందుకు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో అలావుద్దీన్, లవకుష్ తమ వెంట ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు 100 గ్రాముల గంజాయి తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ముగ్గురు హన్స్రాజ్, దినేష్, యస్తామికుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు.

దీంతో మొత్తం ఐదుగురిపై సంబంధిత చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ చర్యలు తూప్రాన్ సీఐ వెంకటరాజా గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టగా, ఎస్‌ఐలు గంగరాజు, యాదగిరితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, కలిగి ఉండడం, విక్రయించడం లేదా వినియోగించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తూప్రాన్ పోలీసులు హెచ్చరించారు.

Blogger ఆధారితం.