-->

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన పోలీస్ బాస్?

 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన పోలీస్ బాస్?

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్‌ ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులు పట్టుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. మరి అదే డ్రైవ్‌లో ఏకంగా ఓ పోలీస్‌ అదికారి పట్టుబడితే.. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో అదే జరిగింది.

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పోలీసులు పట్టుకోవడం తరచూ మనం చూస్తూనే ఉన్నాం. మరి అదే డ్రైవ్‌లో ఏకంగా ఓ పోలీస్‌ అదికారి పట్టుబడితే.. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో అదే జరిగింది. బుధవారం రాత్రి మధురానగర్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ (ACP Suman Kumar) వారికి చిక్కారు.

సివిల్ డ్రెస్సులో వామనం నడుపుతూ వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. దానికి ఆయన సహకరించకుండా నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కూడా పోలీసు డిపార్ట్‌మెంట్‌ అంటూ వారిపై మండిపడ్డారు. ఎంతకీ ఆయన బ్రీత్ ఎనలైజర్‌ ముందు ఊదకపోవడంతో.. వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సుమన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793