కరాటేలో ప్రతిభ కనబర్చిన ఖమ్మం నగర విద్యార్థి
వరల్డ్ కప్ ఛాంపియస్ షిప్ లో సత్తా చాటిన మొహమ్మద్ ఆర్మాన్ హుస్సేన్ వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ కరాటే పోటీల్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్ధి మొహమ్మద్ అర్మాన్ ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినట్లు కరాటే కోచ్ మొహమ్మద్ గఫూర్ తెలిపారు.
ఈ నెల 10న గోవాలో నిర్వహించిన వరల్డ్ కప్ ఛాంపియన్ షిప్ కరాటే పోటీల్లో 33 దేశాలతో పోటీపడిన పదిహేండ్ల బాలుడు మొహమ్మద్ ఆర్మాన్ (15) ఉత్తమ ప్రతిభను కనపరిచి గోల్డ్ మెడల్ సాధించి ఖమ్మం జిల్లాకు పేరు తీసుకువచ్చినట్లు తెలిపారు.
వరల్డ్ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన ఖమ్మం పట్టణానికి చెందిన మొహమ్మద్ ఆర్మాన్ పట్ట పలువురు ప్రముఖులు, స్థానికులు ,విద్యార్థులు అభినందించారు.

Post a Comment