-->

వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి

వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి


 వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలి

ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఉద్యోగ నియమకాలు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మయుద్ధ సదస్సు మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాలులో శనివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరై ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసే వరకు ప్రభుత్వంపై పోరాడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన మాట తప్పి మాటలతో మభ్యపెడుతున్నారని అన్నారు. 

30 ఏడ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.