పందుల చోరీ నడిరోడ్డుపై పొట్టు పొట్టు కొట్టుకున్న ఇరువురు
నల్గొండ, సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో హోలీ పండుగ నాడు ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం క్రాస్ రోడ్ల వద్ద రెండు వర్గాల మధ్య పందుల చోరీ అనుమానంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఈ ఘర్షణ నడిరోడ్డు పై కచ్చితంగా ఫిల్మీ స్టైల్‌లో మారిపోయింది.
చోరీ ఆరోపణలతో ఘర్షణ
పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురంకు చెందిన కొందరు వ్యక్తులు, తమ పందులను ఎవరో దొంగిలించి వేరొకచోట విక్రయిస్తున్నారనే అనుమానంతో మరొక వర్గంపై దాడి చేశారు. ఈ విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని, క్షణాల్లో పిడిగుద్దుల జాతరగా మారిపోయింది.
సినీ ఫక్కీలో కిడ్నాప్ ప్రయత్నం
ఘటన మరింత తీవ్రంగా మారి, ఓ వ్యక్తిని ప్రత్యర్థి వర్గం సినీ ఫక్కీలో కిడ్నాప్ చేయడానికి యత్నించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ దృశ్యాలు హోలీ వేడుకల మధ్య నడిరోడ్డుపై జరిగినందున, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పోలీసుల జోక్యం – కేసు నమోదు
వివాదం కాస్త తీవ్రమవ్వడంతో ఇరు వర్గాలు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పట్టణ సీఐ శివశంకర్ వెంటనే స్పందించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Post a Comment