-->

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్‌లో పడుకుంటే ఎలా?

 

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్‌లో పడుకుంటే ఎలా?

ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్‌లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ శాసన మండలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్‌ ఫ్రమ్ ఫామ్ హౌస్ చేస్తున్నారా?" అంటూ సెటైర్లు వేశారు. ప్రభుత్వం నుంచి భారీ జీతభత్యాలు తీసుకుంటూ ఫామ్ హౌస్‌లో నిద్రపోతే ఎలా? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత 15 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదని, కానీ అప్పటినుండి ఇప్పటివరకు రూ.57 లక్షల జీతం పొందారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు.

కేసీఆర్‌పై రేవంత్ కఠిన వ్యాఖ్యలు
"కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని కోరుతున్నాను. నిద్రపోతున్న వారిని లేపొచ్చు కానీ నటిస్తున్న వారిని లేపలేం. సభకు వచ్చి విలువైన సూచనలు చేయాలి. కానీ ఆయన సభకు రాకుండానే లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు" అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అంతేకాక, కేసీఆర్ తన నియోజకవర్గంలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పర్యటించరని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. రైతుల ఆత్మహత్యలకు వారిపై ఉన్న అప్పులే ప్రధాన కారణమని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క ఏడాదిలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలు
రైతులకు మద్దతుగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ,

  • కేవలం ఆరు నెలల్లోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ అమలు చేశామని,
  • అన్నదాతలకు క్వింటాల్ వరికి రూ.500 బోనస్ ఇస్తున్నామని,
  • కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు రాకున్నా 1.57 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించామన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందని ప్రజలే "కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం" అంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల ద్వారానే రైతులకు నీరు అందుతోందని స్పష్టం చేశారు.

సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793