-->

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భర్త ఎదుటే భార్య హత్య

 

సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భర్త ఎదుటే భార్య హత్య

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పరిధిలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను ఆమె భర్త ఎదుటే హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, గండిగూడెం క్రీడా ప్రాంగణం సమీపంలో భార్యాభర్తలు అనిల్ కుమార్, మీనా దేవి (35) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వారి బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ సమయంలో పొదల్లో దాక్కున్న దుండగులు బయటకు వచ్చి మీనా దేవిని బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లినట్లు సమాచారం.

భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన అనిల్ కుమార్‌పై దుండగులు కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అతని కళ్లముందే మీనా దేవిని హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, దుండగుల గుర్తింపు తదితర అంశాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సంఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793