-->

లక్షల జీతం వదిలి... ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితం!

లక్షల జీతం వదిలి... ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితం!

బెంగళూరు, మే 31: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో భారీ జీతాలు, కార్పొరేట్ జీవితం ఎంతో మందికి కలల కెరీర్‌గా భావిస్తారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. ఐటీ రంగంలో పనిచేస్తూ లక్షల్లో జీతం పొందుతున్న ఆమె, ఉద్యోగ ఒత్తిడి, నిరంతర పని గంటలతో విసిగిపోయి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆటో డ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

ప్రస్తుతం ఆమె తన సొంత సమయానికి అనుగుణంగా ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలకుపైగా సంపాదిస్తున్నట్లు తెలిపింది. కార్పొరేట్ ఉద్యోగంతో పోలిస్తే ఇప్పుడు తాను మరింత ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నానని ఆమె వెల్లడించింది.

ఈ విషయాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, డబ్బు కంటే మానసిక ప్రశాంతత, వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమని ఆమె చెప్పిన మాటలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి.

సాంప్రదాయ కెరీర్‌ను వదిలి తనకు నచ్చిన వృత్తిని ఎంచుకుని సంతృప్తికరమైన జీవితం గడుపుతున్న ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. "విజయం అంటే కేవలం అధిక జీతం కాదు, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయమే" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793