-->

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇకపై ఒకే తరహా హెయిర్ కట్..!

 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇకపై ఒకే తరహా హెయిర్ కట్..!

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇకపై ఒకే తరహా హెయిర్ కట్..!

అమరావతి, జులై 20: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే బాలురందరూ ఇకపై ఒకే తరహా హెయిర్ కట్‌తో పాఠశాలకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

సినీ హీరోలు, క్రికెటర్లను అనుసరిస్తూ విద్యార్థులు విభిన్న హెయిర్ స్టైల్స్‌తో పాఠశాలలకు వస్తుండటంతో, చదువుకంటే రూపురేఖలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందించడంతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని బాలురు అందరూ ఒకే విధమైన సాధారణ హెయిర్ కట్‌తో పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్‌కు ఇకపై పాఠశాలల్లో బ్రేక్ పడనుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793