-->

అల్లుడి మృతి తట్టుకోలేక అత్తకూ గుండెపోటు.. ఒకే కుటుంబంలో రెండు విషాదాలు

 

అల్లుడి మృతి తట్టుకోలేక అత్తకూ గుండెపోటు.. ఒకే కుటుంబంలో రెండు విషాదాలు

అల్లుడి మృతి తట్టుకోలేక అత్తకూ గుండెపోటు.. ఒకే కుటుంబంలో రెండు విషాదాలు

జమ్మికుంట (హుజూరాబాద్‌): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అల్లుడు మృతిచెందిన విషాదాన్ని తట్టుకోలేక అత్త గుండెపోటుతో మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బూర్ల రంజిత్ (35) గత ఏడాదిగా జమ్మికుంటలోని కొత్తపల్లిలో అద్దె ఇంట్లో కుటుంబంతో నివసిస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు అనారోగ్యానికి గురయ్యాడు.

ఆదివారం కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందిన రంజిత్, అనంతరం మళ్లీ తీవ్ర నొప్పితో అస్వస్థతకు గురై రోడ్డుపై కుప్పకూలి మృతిచెందాడు.

అల్లుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న అతడి అత్త గుండేటి పద్మ (55) తీవ్ర ఆవేదనకు గురై బోరున విలపించింది. ఆ షాక్‌ను తట్టుకోలేక గుండెపోటుతో ఆమె కూడా మృతిచెందింది.

పద్మ తన కుమార్తె శీరిష ప్రసవానంతర సంరక్షణ కోసం ఇటీవల మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి కొత్తపల్లికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అల్లుడు ఆకస్మికంగా మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది.

మృతుడు రంజిత్‌కు భార్య శీరిషతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఒకేరోజు అల్లుడు, అత్త మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793