వయోవృద్ధుల సాధికారిత రాష్ట్ర పురస్కారాలు–2026కు దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1, 2026న ప్రదానం చేయనున్న వయోవృద్ధుల సాధికారిత రాష్ట్ర పురస్కారాలు–2026 కోసం అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారిత శాఖ అధికారులు తెలిపారు.
వయోవృద్ధుల సాధికారత, సంక్షేమం కోసం విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఈ పురస్కారాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
వ్యక్తిగత కేటగిరీలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటిజన్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సామాజిక సేవ, సమాజ అభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు, కళలు, సాహిత్యం, సంస్కృతి, క్రీడలు, వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, ప్రజాసేవ, పర్యావరణం, సమాజ సంక్షేమం తదితర రంగాల్లో గణనీయమైన కృషి చేసిన సీనియర్ సిటిజన్లను పరిగణనలోకి తీసుకోనున్నారు.
అదేవిధంగా వయోవృద్ధుల సంక్షేమం కోసం అసాధారణ సేవలు అందిస్తున్న వ్యక్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోవృద్ధుల రక్షణ, సంక్షేమం, వారి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నవారు, వారి జీవన ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదలకు దోహదపడుతున్నవారు అర్హులు.
సంస్థాగత కేటగిరీలో వయోవృద్ధుల సంక్షేమం, సంరక్షణ, రక్షణ, సాధికారత కోసం నిరంతర, వినూత్న, ఆదర్శప్రాయమైన సేవలు అందిస్తున్న సంస్థలు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వయోవృద్ధుల సంఘాలు, ఎన్జీవోలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరీల వారీగా దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను www.wdsc.telangana.gov.in� వెబ్‌సైట్‌లో పొందవచ్చని అధికారులు తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి సెప్టెంబర్ 26, 2026 సాయంత్రం 5 గంటలలోపు హార్డ్‌కాపీ రూపంలో సమర్పించాలి.
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:
సంచాలకుల కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారిత శాఖ, గ్రౌండ్ ఫ్లోర్, దివ్యాంగుల సంక్షేమ భవన్, నల్గొండ ఎక్స్ రోడ్, మలక్‌పేట్, హైదరాబాద్–500036. మరిన్ని వివరాల కోసం 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Post a Comment