-->

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

 

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

పాల్వంచ: నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాత పాల్వంచలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం తరఫున చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ టి. రామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంటి అద్దాలను అందజేశారు.

గత నెలలో పాల్వంచ పరిధిలోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో నవ లిమిటెడ్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 1,400 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 170 మంది విద్యార్థులకు ఉచితంగా మందులు అందించారు. కంటి పరీక్షల్లో అద్దాలు అవసరమని గుర్తించిన విద్యార్థులకు తాజాగా ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి టి. రామారావు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

నవ లిమిటెడ్ సీఎస్‌ఆర్ హెడ్ డి. సుధాకర్ మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, జీవనోపాధి రంగాల్లో CSR కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు సంస్థ కృషి చేస్తోందన్నారు.

కార్యక్రమంలో నవ లిమిటెడ్ సివిల్ హెడ్ పి. గోపాలకృష్ణ, పాత పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. ప్రభావతి, వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సీఎస్‌ఆర్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.