రహబల్ ఫౌండేషన్ సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం తోపుడు బండ్ల పంపిణీ
కొత్తగూడెంలో రహబల్ ఫౌండేషన్ సఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి కోసం తోపుడు బండ్ల ఉచిత పంపిణీ
కొత్తగూడెంలో రహబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు తోపుడు బండ్ల (Push Carts) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఉద్యోగ అవకాశాలు లేని లేదా చిన్న వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక స్తోమత లేని వారికి తోపుడు బండ్లను అందించడం ద్వారా వారు కూరగాయలు, పండ్లు, చిరుతిళ్లు, ఆహార పదార్థాలు తదితర వస్తువుల విక్రయంతో తమకు తాముగా ఉపాధి పొందే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.
రహబల్ ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా తమ కుటుంబాలను పోషించుకోవడంతో పాటు ఆర్థికంగా స్థిరపడేందుకు అవకాశం లభిస్తుంది. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సాధికారత సాధించడమే ఫౌండేషన్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పేర్కొనవచ్చు.
“సహాయం అంటే కేవలం ఆర్థిక సాయం అందించడం మాత్రమే కాదు.. ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడేలా చేయడం నిజమైన సహాయం” అనే ఉద్దేశంతో రహబల్ ఫౌండేషన్ ఈ స్వయం ఉపాధి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో జామియాట్ ఉలమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మౌలానా అబ్దుల్ కరీం, మొహ్మద్ అక్బర్, మొహ్మద్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment