-->

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం.. ఐఏఎస్ పీఎస్ రాజు మృతి

 

కుప్పకూలిన రాజు.. వెంటనే సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం.. ఐఏఎస్ పీఎస్ రాజు మృతి

కుప్పకూలిన రాజు.. వెంటనే సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఆవరణలో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) రాజు ఆకస్మికంగా మృతి చెందారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధులకు హాజరైన ఆయన.. ఆవరణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు.

రాజు కిందపడిపోవడాన్ని గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన వద్దకు చేరుకుని సీపీఆర్ (CPR) చేశారు. అనంతరం వైద్య సిబ్బందిని పిలిపించి ప్రాథమిక వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. అంబులెన్స్‌ను రప్పించి రాజును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించే మార్గంలోనే రాజు తుదిశ్వాస విడిచినట్లు తాజా సమాచారం. ఆయన మృతిని వైద్యులు ధ్రువీకరించారు.

అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ ఘటనతో అధికారులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజు మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అత్యవసర పరిస్థితిలో వెంటనే స్పందించి రాజుకు సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి తీరుపై అసెంబ్లీ సిబ్బంది, అధికారులు ప్రశంసలు వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.