-->

సికింద్రాబాద్–కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్

 

సికింద్రాబాద్–కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్

సికింద్రాబాద్–కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్–కాగజ్‌నగర్ మధ్య రెండు జనసాధారణ (అన్‌రిజర్వ్‌డ్) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో అన్ని బోగీలు సాధారణ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

రైలు నంబర్ 07235 సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్‌నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07236 కాగజ్‌నగర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఆగనున్నాయి.

ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు సాధారణ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Blogger ఆధారితం.