-->

భార్య ముక్కు కొరికిన భర్త.. మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన

 

భార్య ముక్కు కొరికిన భర్త.. మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన

భార్య ముక్కు కొరికిన భర్త.. మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన

కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యపై దాడికి పాల్పడటమే కాకుండా, అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆమె ముక్కును కొరికిన ఘటన కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లికి చెందిన మమతకు మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నాలుగేళ్లుగా అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని మమత ఆరోపించినట్లు సమాచారం. దీంతో సుమారు పది రోజుల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది.

ఈ క్రమంలో సోమవారం మణిచందర్ అత్తగారింటికి వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ కుటుంబ సభ్యులతో వివాదం చోటుచేసుకోవడంతో మమత తండ్రిపై మణిచందర్ దాడికి పాల్పడినట్లు సమాచారం. దాడిని అడ్డుకునేందుకు మమత ప్రయత్నించగా.. ఆగ్రహానికి గురైన మణిచందర్ ఆమె ముక్కును బలంగా కొరికినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో మమత ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Blogger ఆధారితం.