తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడి ఆత్మహత్య
తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడి ఆత్మహత్య
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెబ్బెన మండలంలో చోటుచేసుకుంది.
రెబ్బెన మండలం పుంజుమెరగుడకు చెందిన వడై సిద్ధార్థ (20) ఇంట్లో డబ్బులు తీసుకున్న విషయమై తండ్రి నాగేష్ మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సిద్ధార్థ ఈ నెల 9న రాత్రి పంటచేనుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం సిద్ధార్థ మృతి చెందాడు. తండ్రి నాగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెబ్బెన ఎస్‌ఐ వెంకట కృష్ణ తెలిపారు.

Post a Comment