-->

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 24 మందికి గాయాలు

 

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 24 మందికి గాయాలు  ఏలూరు జిల్లా, సెప్టెంబర్ 12: ఏపీలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.  ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు.. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.  ప్రమాద తీవ్రత క్లీనర్ వైపు ఎక్కువగా ఉండటంతో క్లీనర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న 24 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. బస్సులు అదుపుతప్పడం, లారీలు, ఇతర వాహనాలను ఢీకొనడం వంటి ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది.

ఏపీలో ఘోర బస్సు ప్రమాదం.. ఒకరు మృతి, 24 మందికి గాయాలు

ఏలూరు జిల్లా, సెప్టెంబర్ 12: ఏపీలో తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం యండపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తున్న జగన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు.. రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రమాద తీవ్రత క్లీనర్ వైపు ఎక్కువగా ఉండటంతో క్లీనర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న 24 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా బస్సు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. బస్సులు అదుపుతప్పడం, లారీలు, ఇతర వాహనాలను ఢీకొనడం వంటి ఘటనలతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొంది.

Blogger ఆధారితం.