-->

పసుపు నీళ్లతో శుద్ధి.. మాజీ సర్పంచ్ సహా ఆరుగురు అరెస్టు

 

పసుపు నీళ్లతో శుద్ధి.. మాజీ సర్పంచ్ సహా ఆరుగురు అరెస్టు

పసుపు నీళ్లతో శుద్ధి.. మాజీ సర్పంచ్ సహా ఆరుగురు అరెస్టు

ములుగు: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ వద్ద దళితులు తిరిగారంటూ పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. దళితులను అవమానించేలా వ్యవహరించారంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో వరదరాజ్‌పూర్ మాజీ సర్పంచ్‌తో పాటు ఆరుగురు బీఆర్‌ఎస్‌ నాయకులను సోమవారం విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అనంతరం నిందితులను గజ్వేల్‌కు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించినట్లు తెలుస్తోంది.

కాగా, కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.