-->

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

 

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

పెద్ద దోర్నాల: విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చే పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

చీరాలకు చెందిన నన్నం దుర్గారావు (55), తండ్రి రామదాసు, పెద్ద దోర్నాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతన ట్రాన్స్‌ఫార్మర్ అమర్చే పనుల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్ శాఖ ఏఈ బీమా నాయక్, ఎస్‌ఐ వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది? విద్యుత్ సరఫరా నిలిపివేసిన సమయంలోనే పనులు జరిగాయా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. విచారణ పూర్తయిన అనంతరం ప్రమాదానికి గల పూర్తి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కార్మికుడి మృతితో కుటుంబ సభ్యులు, సహచరులు విషాదంలో మునిగిపోయారు.

Blogger ఆధారితం.