-->

బండ్లగూడలో దారుణ హత్య.. కత్తుల దాడిలో ఆటో డ్రైవర్ మృతి

 

బండ్లగూడలో దారుణ హత్య.. కత్తుల దాడిలో ఆటో డ్రైవర్ మృతి

బండ్లగూడలో దారుణ హత్య.. కత్తుల దాడిలో ఆటో డ్రైవర్ మృతి

బండ్లగూడ: బండ్లగూడలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. సుప్రీమ్ వైన్స్ సమీపంలో ఆటో డ్రైవర్, రౌడీషీటర్‌గా పేర్కొంటున్న మొహమ్మద్ నయీమ్‌ (35–40)పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నయీమ్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి సుమారు 9:20 గంటల సమయంలో సుప్రీమ్ వైన్స్ వద్ద నయీమ్‌పై 5–6 మంది వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో నయీమ్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. హత్యకు గల కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Blogger ఆధారితం.