-->

హృదయ విదారక ఘటన.. రోడ్డుపై అనాథలా వదిలేసిన పసికందు

 

హృదయ విదారక ఘటన.. రోడ్డుపై అనాథలా వదిలేసిన పసికందు

శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన.. రోడ్డుపై అనాథలా వదిలేసిన పసికందు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్నపేగు బంధాన్నే మరిచిన గుర్తుతెలియని వ్యక్తులు ఓ నవజాత శిశువును రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహ సమీపంలో కలకలం రేపింది.

స్థానికులు శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా రోడ్డుపక్కన పసికందు ఒంటరిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలానికి చేరుకుని శిశువును సురక్షితంగా రక్షించి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల అప్రమత్తతతో శిశువుకు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా తప్పింది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శిశువును అక్కడ వదిలేసిన వారు ఎవరనే కోణంలో సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కీలక ఆధారాల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆవేదనకు గురి చేయగా, పసికందును ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793