-->

తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలు చేపట్టిన సముద్రాల క్రాంతి కుమార్

 

కల్వకుంట్ల కవితకు మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన జిల్లా సముద్రాల క్రాంతి కుమార్

తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలు చేపట్టిన సముద్రాల క్రాంతి కుమార్

కల్వకుంట్ల కవితకు మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన జిల్లా సముద్రాల క్రాంతి కుమార్

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రక్షణ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలను సముద్రాల క్రాంతి కుమార్ చేపట్టారు. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో ఆయన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు కల్వకుంట్ల కవితకు సముద్రాల క్రాంతి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున పోరాటాలు నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. యువత, మహిళలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు తదితర వర్గాలను పార్టీతో అనుసంధానం చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ రక్షణ సేనకు బలమైన కేడర్‌ను నిర్మించేందుకు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగుతానని సముద్రాల క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత సూచనలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ జిల్లాలో పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

Blogger ఆధారితం.