-->

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. (వీడియో)

 

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..(వీడియో)

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. హైదరాబాద్‌కు తరలింపు

వరంగల్, జులై 26: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురికావడంతో ఆదివారం తెల్లవారుజామున హనుమకొండలోని రోహిణి ఆసుపత్రిలో చేరారు. ఆయనకు తీవ్ర అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.


పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రోహిణి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గుండెపోటు లక్షణాలతో ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. అత్యవసర చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన గుండె పనితీరు నియంత్రణలో ఉందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

వైద్య పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ (లంగ్స్ ఇన్ఫెక్షన్) కూడా ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. దీంతో మరింత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని వైద్యులు, కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు. అధికారికంగా విడుదల చేసే వైద్య బులెటిన్‌లను మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయనకు నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793