-->

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్..! త్వరలో ప్రారంభం

 

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్..! త్వరలో ప్రారంభం

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్..! త్వరలో ప్రారంభం

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల తొలి వారంలో లేదా ఆగస్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవం) సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్తగా అందజేయనున్న ఈ స్మార్ట్ రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం ఉండటంతో లబ్ధిదారుల వివరాలను సులభంగా ధృవీకరించే అవకాశం ఉంటుంది. అలాగే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరగడంతో పాటు నకిలీ కార్డుల వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను ముద్రించినట్లు సమాచారం. త్వరలోనే పంపిణీ తేదీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793