32 ఎయిర్‌పోర్టుల నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభం
భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసిన 32 విమానాశ్రయాల నుంచి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో భద్రతాపరంగా ఈ విమానాశ్రయాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రారంభంలో ఈ నెల 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని భావించినా, పరిస్థితి క్రమంగా నియంత్రణలోకి వస్తుండటంతో సంబంధిత అధికారులు విమానాశ్రయాల కార్యకలాపాలను మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో ఈ 32 ఎయిర్‌పోర్టుల్లో మళ్లీ సాధారణ రాకపోకలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో, ప్రయాణికులు తమ ప్రయాణాలు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని, విమాన సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలతో సంప్రదించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న ఈ ఎయిర్‌పోర్టుల పునఃప్రారంభంతో వాణిజ్య మరియు సాధారణ విమానయాన కార్యకలాపాలు తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంది.
ఈ పరిణామం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఇప్పుడు తిరిగి టికెట్లు బుక్ చేసుకోవడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
Post a Comment