-->

పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తత మధ్య జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణత్యాగం

నాందేడ్: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ జరిపిన కాల్పుల్లో భారత సైనికుడు సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందాడు. మౌలికంగా మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామానికి చెందిన ఆయన, దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించాడు.

ఈరోజు సాయంత్రం సచిన్ యాదవ్ పార్థివదేహం స్వస్థలానికి చేరుకోనుంది. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారిక సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

దేశం కోసం ప్రాణాలర్పించిన సచిన్ వనాంజే వీరత్వం ప్రజల మదిలో నిలిచిపోతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.

Blogger ఆధారితం.