లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన TGSPDCL సహాయక ఇంజనీరు
హైదరాబాద్, మే 7: హైదరాబాద్ నగరంలోని ప్రగతినగర్ TGSPDCLలో పనిచేస్తున్న సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్) ఎ. జ్ఞానేశ్వర్ రూ. 50,000/- లంచం డిమాండ్ చేసిన కేసులో తెలంగాణ అవినీతినిరోధక శాఖ (#ACB) అధికారులకు చిక్కారు. ఫిర్యాదుదారునికి చెందిన ప్లాట్‌లో 63 కిలోవోల్ట్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి, 9 విద్యుత్ మీటర్లు అమర్చేందుకు అనుమతి పత్రం జారీ చేయడానికి ఆయన ఈ లంచాన్ని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.10,000/- స్వీకరిస్తుండగా అధికారుల చేతిలో దొరికిపోయారు.
ప్రజలు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే వెంటనే స్పందించాలని అవినీతినిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా సంప్రదించవచ్చు. అదేవిధంగా, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ (acb.telangana.gov.in) వేదికల ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు.
ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి
Post a Comment