ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ కన్నుమూత
జాతీయ అవార్డు గ్రహీత, భారతీయ సినీ రంగంలో ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ ఈ రోజు అకాలమరణం చెందారు. తొలి దశలో మరాఠీ చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, తరువాత హిందీ సినిమాలకు మేకప్ ఆర్టిస్ట్‌గా సేవలు అందించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ విభాగంలో జాతీయ అవార్డు అందుకోవడం ఆయన కెరీర్‌లో ముఖ్యమైన ఘట్టం.
విక్రమ్ గైక్వాడ్ మృతిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “సినిమా రంగానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయన మృతి చాలా బాధాకరం,” అని ఆయన నివాళులర్పించారు.
ఇక చిత్ర పరిశ్రమలోని అనేక మంది ప్రముఖులు కూడా ఈ విషాద వార్తపై స్పందిస్తూ, సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.
విక్రమ్ గైక్వాడ్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు ముంబైలోని దాదర్ శివాజీ పార్క్ స్మశాన వాటికలో జరగనున్నాయి. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
Post a Comment