వీర జవాను మురళీ నాయక్‌కు పార్థివదేహాన్ని చివరి చూపు కోసం జనసముద్రం
కల్లితండా వర్షం కురుస్తున్నా, గాలులు వీస్తున్నా, నిండు మనసుతో జనాలు తండోపతండాలుగా రోడ్లపైకి వచ్చారు. కారణం ఒక్కటే—దేశానికో వీరపుత్రుడిగా ప్రాణం అర్పించిన జవాను మురళీ నాయక్‌కు తమ గౌరవాన్ని చాటడం. "జై జవాన్! జై జవాన్!" అంటూ నినాదాలు చేస్తూ, అతని పార్థివదేహాన్ని చివరి చూపు కోసం చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
బెంగళూరులోని ఆర్మీ క్యాంప్ నుంచి మురళీ నాయక్ పార్థివదేహాన్ని స్వగ్రామమైన కల్లితండాకు తరలిస్తున్న క్రమంలో, మార్గమంతా జన నేరాజనంలా మారింది. రోడ్డుదారిలో వర్షం కురుస్తున్నా ఎవరూ వెనక్కి తడలేదు. జాతీయ జెండాలతో, పూలతో, కన్నీటి నివాళులతో ప్రజలు వీరుని స్మరించుకున్నారు.
మురళీ నాయక్ ఆర్మీలో విధులు నిర్వహిస్తూ శత్రువులతో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందారు. దేశానికి సేవలందించిన ఆయనకు నివాళులర్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రేపు (మే 11) ఉదయం అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. భారత త్రివర్ణ పతాకం కప్పబడిన అతని భౌతిక కాయం తూర్పుతెగెల ప్రాంత ప్రజల గుండెల్లో స్ఫూర్తిగా నిలిచిపోతుంది.
వీరుని స్మరించుకుంటూ... జై జవాన్!
Post a Comment