-->

తల్లిదండ్రుల లేని ముగ్గురు తోబుట్టువుల పెళ్లిలు చేసి తాను పెళ్లి చేసుకుంటున్న జ్యోతికి సహాయహస్తం

తల్లిదండ్రుల లేని ముగ్గురు తోబుట్టువుల పెళ్లిలు చేసి తాను పెళ్లి చేసుకుంటున్న జ్యోతికి సహాయహస్తం


జనగామ: తల్లిదండ్రులు లేని ముగ్గురు తోబుట్టువుల పెళ్లిళ్లు చేసి జనగామ గ్రామానికి చెందిన యువతీ బోనగిరి జ్యోతి ముందుకు వచ్చి పేరంటాలు చేసి తాను పెళ్లి చేసుకోబోతున్నది. ఈ నేపథ్యంలో బోనగిరి జ్యోతికి పలు దాతలు ఆర్థికంగా తోడుగా నిలుస్తున్నారు.

మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్, జ్యోతికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందించగా, మాజీ జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ రూ. 5,000 సాయం చేశారు. ఈ సాయంతో జ్యోతి తన పెళ్లి ఏర్పాట్లను కొనసాగిస్తోంది.

ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొబ్బురి బాపు రెడ్డి, పార్టీ గ్రామాధ్యక్షుడు పాత పండరి, విద్యార్థి నాయకుడు రేగుల సంతోష్, సీనియర్ నాయకుడు పర్శరములు తదితరులు పాల్గొన్నారు.

సహృదయతతో సహాయం చేసిన నాయకులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లిదండ్రుల అనాధలను ఆదుకోవడంలో ఇది ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Blogger ఆధారితం.