కేదార్‌నాథ్ సేవా సమితిని అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంచు కొండల్లో మానవతా సేవకు గొప్ప ఉదాహరణ:
సిద్దిపేట: మానవ సేవే మాధవ సేవ అని నమ్మే హృదయవంతులైన కేదార్‌నాథ్ సేవా సమితి సభ్యులు, ఎముకలు విరిగే మంచు చలిని లెక్కచేయకుండా హిమాలయాల్లో భక్తులకు అన్నదాన సేవ చేస్తున్నందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గారు వారిని ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మంచు కొండల్లో మీరు అందిస్తున్న మి సేవా అమోఘం. సిద్ధిపేట ప్రసాదాన్ని ఎల్లలు దాటి భక్తుల మధ్యకు తీసుకెళ్లిన మీ చొరవ నిజంగా గొప్పది. ఈ విధమైన సేవా కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడు ఉంటుంది," అని తెలిపారు.
10 రోజులపాటు కేదార్‌నాథ్‌లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సేవా సమితి సభ్యులు మానవత్వానికి గొప్ప నిదర్శనం చూపించారని, ఈ స్ఫూర్తితో సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. మానవతా విలువలు పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు యువతలో సేవా దృక్పథాన్ని బలపరుస్తాయని హరీష్ రావు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు, సేవా సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సభ్యులకు శాలువాలతో సత్కారం చేసి, సేవా కార్యక్రమాల్లో వారు చూపిన పట్టుదల, భక్తి భావాన్ని కొనియాడారు.
Post a Comment