శీర్షిక: అంతర్జాతీయ పితృ దినోత్సవ శుభాకాంక్షలు (జూన్ 15)
✍️ రచన: మంజుల పత్తిపాటి, మాజీ డైరెక్టర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా...
నా కళ్లముందు రక్షణ కవచంలా నిలిచిన వ్యక్తి నాన్న.
నిశ్శబ్దంగా ప్రేమను పంచుతూ, ప్రతి అక్షరానికి అర్థం చెప్పిన గురువు నాన్న.
గెలిచినపుడు పదిమందిలో ఆనందంగా పంచుకునే సంతోషం ఆయన కన్నుల్లో...
ఓడిపోయినపుడు మాత్రం భుజంపై చేతి తడి ఉంచి, "నువ్వు గెలుస్తావు తప్పకుండా!" అని
ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపిన తండ్రి.
నాన్న అంటే...
ఓ ఆప్యాయత, ఓ భరోసా, ఓ త్యాగప్రతిమ.
తొలి గురువు, మొదటి స్నేహితుడు, జీవన మార్గదర్శి.
పిల్లల ప్రపంచాన్ని బొమ్మలతో రంగరించిన ఆటపటాల సైగలు నాన్నవి.
నన్ను సరైన దారిలో నడిపించిన మార్గనిర్దేశకుడు కూడా ఆయనే.
నాన్న నేడు నాతో లేరేమో...
కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం
నా హృదయంలో ఎప్పటికీ మిగిలిపోయాయి —
వాటి స్ఫూర్తితోనే నా కలలకు రూపు దిద్దుతున్నాను.
నాన్నా...
మీ ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని.
మీ పేరు చెప్పుకోగానే నాకు పునాదిలా బలమొస్తుంది.
అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా
ప్రపంచంలోని ప్రతి తండ్రికీ
హృదయపూర్వక శుభాకాంక్షలు!
Post a Comment