-->

57వ డివిజన్‌లో శానిటేషన్ వర్కర్‌పై కోతుల దాడి – ప్రజాప్రతినిధుల పరామర్శ

57వ డివిజన్‌లో శానిటేషన్ వర్కర్‌పై కోతుల దాడి – ప్రజాప్రతినిధుల పరామర్శ


నగరంలోని 57వ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ వర్కర్ క్రిష్ణపై కోతులు దాడి చేసి కరిచిన ఘటన కలకలం రేపింది. విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తుండగా అకస్మాత్తుగా కోతులు దాడి చేయడంతో క్రిష్ణ గాయపడ్డాడు.

సహచర సిబ్బంది వెంటనే స్పందించి క్రిష్ణను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబ శివరావు ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధితుడికి తక్షణమే తగిన చికిత్స అందించాలని సూచించారు.

అలాగే నగర మేయర్ గణేష్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని క్రిష్ణ ఆరోగ్య పరిస్థితిని వివరంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని పరామర్శించి, అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా 57వ డివిజన్ కార్పొరేటర్ సాహెర యూసుఫ్ మొహమ్మద్, 53వ డివిజన్ కార్పొరేటర్ బండి నర్సింహ రావు, 49వ డివిజన్ కార్పొరేటర్ బోయిన విజయ్ కుమార్, శానిటేషన్ వర్కర్లు మరియు సిపిఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

నగరంలో కోతుల బెడద పెరుగుతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793