గాంధీ చౌక్‌లో శాంతి ర్యాలీ… “మనమంతా భారతీయులం” నినాదంతో ఐక్యత సందేశం
నగరంలోని గాంధీ చౌక్ వద్ద శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. “మనమంతా భారతీయులం” అనే నినాదంతో వివిధ మతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా పాల్గొని సామరస్య సందేశాన్ని చాటిచెప్పారు.
ఈ సందర్భంగా సిక్కు సోదరుల తరఫున కృపాల్ సింగ్ సోడి మాట్లాడారు. మానవాళి అంతా ఒకే కుటుంబమని ఆయన పేర్కొన్నారు. సర్వమత సమానత్వమే నిజమైన మానవత్వమని, మతపరమైన ఆచారాల కంటే సత్యం, దయ, నిస్వార్థ సేవల ద్వారానే దేవున్ని చేరుకోగలమని అన్నారు. ఇదే నిజమైన మతమని స్పష్టం చేశారు.
ప్రస్తుత కాలంలో సమాజంలో శాంతి, ఐక్యత అత్యవసరమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మత భేదాలను పక్కన పెట్టి పరస్పర గౌరవంతో జీవించాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.
ఈ శాంతి ర్యాలీ సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.

Post a Comment