-->

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం


ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం ఉదయం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు టోల్‌గేట్ దాటుతున్న సమయంలో, అదుపు తప్పిన భారీ కాంక్రీట్ రెడీమిక్సర్ లారీ కారుపై బోల్తా పడింది.

లారీ భారీ బరువుతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలైనట్లు సమాచారం.

ప్రమాదం అనంతరం వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో లారీని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793