-->

హెడ్‌మాస్టర్ బాగోతాలు బట్టబయలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు

హెడ్‌మాస్టర్ బాగోతాలు బట్టబయలు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు, పూజల పేరిట లక్షల మోసం


మహబూబాబాద్ జిల్లా: సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన గురువు వృత్తికి మచ్చ తెచ్చే ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాజోలు ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ జాడ్పోడ్ ప్రతాప్ అక్రమాలు, అనైతిక చర్యలు ఒక్కొక్కటిగా బయటపడుతూ స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

పూజల పేరిట రూ.10 లక్షల మోసం

స్టేషన్ గుండ్రాతి మడుగుకు చెందిన ప్రతాప్, తునగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తిని మోసం చేశాడు. పూజలు చేస్తే అన్నీ మంచిగా జరుగుతాయని నమ్మబలికి రూ.10 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా ఆ డబ్బును విరాళంగా ప్రకటిస్తే మరింత డబ్బు వస్తుందని చెప్పి ఒప్పందం కూడా చేసుకున్నాడు. చివరికి ఆ డబ్బుతో ఖమ్మంలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

మోసపోయిన బాధితుడు కురవి పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పాత కేసులు బయటపడ్డాయి

ప్రతాప్‌పై గతంలో కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కట్టెలమండి పాఠశాలలో పనిచేసే సమయంలో చిన్నపిల్లలకు అశ్లీల చిత్రాలు చూపించాడనే ఆరోపణలతో పోక్సో చట్టం కింద కేసు నమోదై, జైలుశిక్ష అనుభవించినట్లు సమాచారం.

బాబా అవతారంలో దందా

జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రతాప్ తన తీరును మార్చుకుని ‘బాబా’ అవతారం ఎత్తాడు. పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పూజల సమయంలో మహిళలపై చేతులు వేయడం, భక్తి పేరుతో వారి భయాన్ని ఆసరాగా తీసుకుని అనైతికంగా ప్రవర్తించడం స్థానికులను ఆగ్రహానికి గురి చేసింది.

పిల్లలపై దారుణ ప్రవర్తన

పూజల సమయంలో చిన్నపిల్లలను కూడా భయభ్రాంతులకు గురిచేస్తూ, బూడిద చల్లడం, వింత చేష్టలతో వేధించడం వంటి చర్యలు బయటపడ్డాయి. పిల్లలు భయంతో ఏడుస్తున్నా కనీసం జాలి చూపలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం పై ఆగ్రహం

ఇంతటి ఆరోపణలు ఉన్నప్పటికీ, విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం పై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793