ఇందిరమ్మ చీరలు.. కొత్త డిజైన్లను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మే 26: తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్న సరికొత్త “ఇందిరమ్మ చీరల” డిజైన్లను ముఖ్యమంత్రి A. Revanth Reddy మంగళవారం సచివాలయంలో అధికారికంగా విడుదల చేశారు.
ఈసారి చీరలను ఆకుపచ్చ రంగుతో, మరూన్ బోర్డర్ కలయికలో ఆకర్షణీయంగా రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఈ చీరలను తయారు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు ప్రోత్సాహం అందించడంతో పాటు చేనేత రంగానికి కూడా ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అదే కార్యక్రమంలో మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్రవ్యాప్తంగా 8,000 “ఇందిరా స్త్రీ శక్తి భవనాల” నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనాలు కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయి.

Post a Comment