-->

ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. వెలుగులోకి సంచలన విషయాలు

కేరళలోని కొచ్చి కేంద్రంగా నడుస్తున్న భారీ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా, సెక్స్ రాకెట్ ముఠాను అక్కడి సిటీ పోలీసులు ఛేదించారు. మోడలింగ్ రంగం ముసుగులో విదేశాల్లో గ్లామరస్ అవకాశాలు, బ్యూటీ పార్లర్లలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ కేరళకు చెందిన అమాయక యువతులను ఈ ముఠా వలలో వేసినట్లు పోలీసులు గుర్తించారు.

ముఠా మాటలు నమ్మి గల్ఫ్ దేశాలకు వెళ్లిన యువతులను అక్కడ నిర్బంధించి, బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టినట్లు విచారణలో బయటపడింది. విదేశాలకు తీసుకెళ్లిన తర్వాత బాధితులకు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయిన సమయంలో లైంగిక దాడులకు పాల్పడి వాటిని వీడియోలుగా చిత్రీకరించేవారని పోలీసులు తెలిపారు. అనంతరం బాధితుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, ఆ వీడియోలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసి తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు వెల్లడైంది.

ఈ అంతర్జాతీయ ముఠా బారిన పడిన ఇద్దరు యువతులు అక్కడి నుంచి తప్పించుకుని కొచ్చి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కొచ్చి పోలీస్ కమిషనర్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న ఈ రాకెట్ ప్రధాన సూత్రధారి స్టోయ్ సీ సింధు అనే మహిళను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో లుకౌట్ నోటీసుల ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఈ ముఠాకు సహకరించిన మరో ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793