-->

యువకుడిపై కత్తులతో దాడి.. కేసు నమోదు

యువకుడిపై కత్తులతో దాడి.. కేసు నమోదు

వరంగల్ నగరంలోని రామన్నపేట హంటర్ రోడ్ సెంటర్‌లో సోమవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉత్తమ్ కుమార్ అనే యువకుడిపై కొందరు యువకులు కత్తులతో దాడి చేశారు.

స్థానికుల సమాచారం మేరకు, మద్యం మత్తులో ఉన్న యువకులు ఉత్తమ్ కుమార్‌తో వాగ్వాదానికి దిగిన అనంతరం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతడికి తలతో పాటు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన యువకుడిని వెంటనే స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న మట్టేవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దాడికి గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793