-->

ఖమ్మం-పాలేరు రహదారి వెంట భారీ అగ్నిప్రమాదం

ఖమ్మం-పాలేరు రహదారి వెంట భారీ అగ్నిప్రమాదం

ఖమ్మం-పాలేరు పాత రహదారి వెంట కూసుమంచి మండలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూసుమంచి కిరణ్ స్టోన్ క్రషర్ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో రైతులు వరి కొయ్యలు తగలబెట్టడంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి.

గాలులు బలంగా వీయడంతో మంటలు వేగంగా వ్యాపించి పలువురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. అనంతరం అగ్నికీలలు రహదారి పక్కనున్న భారీ వృక్షాలను కూడా చుట్టుముట్టి దగ్ధం చేశాయి.

స్థానిక రైతులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించినప్పటికీ, ప్రస్తుతం ఫైర్ ఇంజన్ అందుబాటులో లేదని అధికారులు తెలిపినట్లు సమాచారం. దీంతో మంటలు మరింత విస్తరిస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పక్కనే ఉన్న కంకర మిల్లు, గురువాయిగూడెం గ్రామాల వైపు కూడా మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అగ్నిమాపక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793