తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు: కలెక్టర్ చిత్రా మిశ్రా
Telangana రాష్ట్రం 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని Karimnagar జిల్లా కలెక్టర్ Chitra Mishra అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న వేడుకలకు సంబంధించి సీటింగ్ ఏర్పాట్లు, ప్రోటోకాల్, ప్రజాప్రతినిధులు, అధికారులకు అవసరమైన సౌకర్యాలు పక్కాగా కల్పించాలని సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ప్రదర్శనలు, సమాచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఫైర్ శాఖ, సఖి, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, మెప్మా, వ్యవసాయ శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో థీమ్ ఆధారిత ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment