-->

కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. మెరుపుదాడిలో మహిళతో పాటు ముగ్గురు అదుపులో

 

కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. మెరుపుదాడిలో మహిళతో పాటు ముగ్గురు అదుపులో

కిరాయి ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. మెరుపుదాడిలో మహిళతో పాటు ముగ్గురు అదుపులో

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై పెద్దనాగారం పరిధిలోని వశ్రాంతండా స్టేజీ వద్ద కిరాయికి తీసుకున్న ఇంటిలో వ్యభిచారం జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి నర్సింహులపేట పోలీసులు దాడి చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, పెద్దనాగారానికి చెందిన ఓ వ్యక్తి ఆ ఇంటిని కిరాయికి తీసుకుని రాత్రి వేళల్లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై బానోత్ వెంకన్న సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించగా, అక్కడ ఉన్న ఓ మహిళతో పాటు ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారానికి ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న వ్యక్తి పోలీసులను గమనించి పరారైనట్లు తెలిసింది.

అదుపులోకి తీసుకున్న మహిళ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినవారిగా, ముగ్గురు వ్యక్తులు తొర్రూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అని ప్రాథమిక సమాచారం వెల్లడైంది. అయితే దీనిపై అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఈ ఘటనపై స్పందించిన ఎస్సై బానోత్ వెంకన్న, విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించామని, ఒక మహిళ, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన నర్సింహులపేట మండలంలో ఇలాంటి వ్యభిచార గృహం నడుస్తున్న విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై పోలీసులు మరింత నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793