-->

యశోద ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

 

యశోద ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

యశోద ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

హైదరాబాద్, జూలై 27: సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌తో కలిసి ఆసుపత్రిని సందర్శించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కేటీఆర్, ఇప్పటివరకు అందించిన చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.

పెద్ది సుదర్శన్ రెడ్డికి అత్యుత్తమ వైద్యం అందించి, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను కేటీఆర్ కోరారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793