-->

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఉమ్మేడ గ్రామంలో ప్రత్యేక శివార్చనలు

 

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఉమ్మేడ గ్రామంలో ప్రత్యేక శివార్చనలు

వర్షాలు సమృద్ధిగా కురవాలని ఉమ్మేడ గ్రామంలో ప్రత్యేక శివార్చనలు

నిజామాబాద్ జిల్లా, జూలై 27: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని ఉమ్మేడ గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు గోదావరి జలాలను తీసుకొచ్చి ఉమామహేశ్వర స్వామికి పవిత్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అర్చనలు, హారతులు సమర్పించి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు నిండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గ్రామంలో ప్రతి ఏడాది నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

వర్షాధార వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఈ ఏడాది మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని అందరూ కలిసి శివునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793