రైలు కిందపడి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. జేబులో ‘నాన్న’ నంబర్!
సికింద్రాబాద్: కళాశాలకు వెళ్లాలని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంటర్ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్-లాలాగూడ రైల్వే మార్గంలో గురువారం చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ రైల్వే పీఎస్ జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడ-సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య అప్‌లైన్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడి ప్యాంటు జేబులో జనరల్ రైలు టికెట్ లభించింది. ఆ టికెట్‌పై ‘నాన్న’ అని పేర్కొంటూ ఓ మొబైల్ నంబర్ రాసి ఉంది. పోలీసులు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా మృతుడు అనంతపూర్‌కు చెందిన గోసల రమేశ్ కుమారుడు పవన్‌సాయి (18)గా గుర్తించారు.
పవన్‌సాయి అనంతపూర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వినాయక చవితి సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన పవన్‌సాయి.. సెలవులు ముగిసిన తర్వాత తిరిగి కళాశాలకు వెళ్లలేదు. దీంతో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై అనంతపూర్ నుంచి సికింద్రాబాద్‌కు చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య పరిష్కారం కాదు
జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎంత తీవ్రమైనవిగా అనిపించినా, ఆత్మహత్య వాటికి పరిష్కారం కాదు. తీవ్ర ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు ఒంటరిగా ఉండకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణుల సహాయం తీసుకోవాలి.
రోషిణి కౌన్సెలింగ్ సెంటర్:
📞 040-66202000 / 040-66202001
📧 roshnihelp@gmail.com

Post a Comment