జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం.. జలకళ సంతరించుకున్న రిజర్వాయర్
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం.. జలకళ సంతరించుకున్న రిజర్వాయర్
హైదరాబాద్, జూలై 27: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ఎట్టకేలకు వరద నీరు చేరడం ప్రారంభమైంది. గత ఏడాది జూన్ రెండో వారంలోనే జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం చేరగా, ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడంతో జూలై చివరి వారంలో ప్రాజెక్టుకు ఫ్లడ్ ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులు దాదాపు నిండిపోయాయి. కృష్ణా నదితో పాటు తుంగభద్ర నదిలోనూ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
కృష్ణా బేసిన్‌లో అత్యంత కీలకమైన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడంతో అక్కడి నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటి ప్రవాహం జూరాల ప్రాజెక్టుకు చేరడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరుగుతూ జలకళ సంతరించుకుంది.
వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు, ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Post a Comment