తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 12 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
బదిలీ అయిన అధికారులకు డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC – Land Acquisition) వంటి కీలక పోస్టింగులు కేటాయించారు. సంబంధిత అధికారులు వెంటనే కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే విధుల్లో చేరిన వివరాలను తక్షణమే ప్రభుత్వానికి నివేదించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA), జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు.
బదిలీ అయిన అధికారులు – కొత్త పోస్టింగులు
- నిర్మల్ తహశీల్దార్ మోతీరామ్ ఎ. → మంచిర్యాల డీఆర్ఓ
- కరీంనగర్‌కు చెందిన బి. రాజేశ్వరి → పెద్దపల్లి డీఆర్ఓ
- పెద్దపల్లికి చెందిన కె.వై. ప్రసాద్ → జగిత్యాల డీఆర్ఓ
- వనపర్తి నుంచి ఆర్. పాండు → నాగర్‌కర్నూల్ డీఆర్ఓ
- ఖమ్మం నుంచి వి. రవికుమార్ → ములుగు డీఆర్ఓ
- మేడ్చల్-మల్కాజిగిరి నుంచి జె. స్వామి → కరీంనగర్ డీఆర్ఓ
- నాగర్‌కర్నూల్ నుంచి ఎ. పాండు → కామారెడ్డి డీఆర్ఓ
ఎస్డీసీ / ప్రత్యేక పోస్టింగులు
- జనగామ తహశీల్దార్ సిహెచ్. శ్రీకాంత్ → మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏ
- ఎం. సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట) → సిద్దిపేట ఎస్డీసీ
- ఎం. రమాదేవి (ఖమ్మం) → నల్గొండ ఎస్డీసీ
- జి. కుమారస్వామి (పెద్దపల్లి) → సిరిసిల్ల ఎస్డీసీ
- ఎన్. వెంకట్ రెడ్డి (కరీంనగర్) → కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ)
రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండేలా ఈ బదిలీలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Post a Comment