-->

సరికొత్త చరిత్ర – చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విక్టరీ

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సరికొత్త చరిత్ర – చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ విక్టరీ


తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి విజయం సాధించడం విశేషంగా నిలిచింది.

చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఈ వార్డులో కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా నగేశ్ పోటీ చేయగా, గట్టి పోటీలో నాగిళ్ల కావేరి సుధాకర్ విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో గెలవడం ఇదే తొలిసారి కావడంతో ఈ ఫలితం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాజిక సమానత్వానికి ఇది ఒక మైలురాయిగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిపత్యం

ఇదిలా ఉండగా, మొత్తం 12 వార్డులు ఉన్న చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 12 వార్డులకు గాను 9 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నాగిళ్ల కావేరి సుధాకర్ విజయం సాధించారు.

ఈ ఫలితాలతో చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించింది. కొత్త కౌన్సిల్ ఏర్పాటుతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793