నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష National Eligibility cum Entrance Test
దేశవ్యాప్తంగా NEET (National Eligibility cum Entrance Test) నేడు నిర్వహించబడుతోంది. వైద్య విద్యలో ప్రవేశాల కోసం అత్యంత కీలకమైన ఈ పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులకు ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.
అయితే, మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు పూర్తిగా మూసివేయబడతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు.
అందువల్ల, అభ్యర్థులు సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Post a Comment